కనిగిరి: పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ హనుమంతునిపాడు ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన
హనుమంతునిపాడు మండలంలోని 23 గ్రామపంచాయతీలలో గ్రీన్ అంబాసిడర్లుగా, కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న వారికి పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ హనుమంతుని పాడు ఎంపీడీవో కార్యాలయం ఎదుట సోమవారం కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.... గత ఐదేళ్లుగా కాంట్రాక్ట్ మరియు గ్రీన్ అంబాసిడర్లుగా పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం వేతనాలను చెల్లించలేదన్నారు. తక్షణం వారికి పెండింగ్ వేతనాలను చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.