రాయచోటి మండల పరిధిలోని మాధవరం గ్రామం కొండ కింద వారి పల్లెలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో కలిసి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొండ కింద వారి పల్లెలో సింగిల్ ఫేస్ మోటర్ చెడిపోయి 15 నెలలు గడిచినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు, అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని స్థానికులు వాపోతున్నారని తెలిపారు.