ఒంగోలు అర్బన్: ట్రాఫిక్ పోలీసులకు వేసవి కిట్ ను అందజేసిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్.
Ongole Urban, Prakasam | May 6, 2026
పోలీస్ సిబ్బంది సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా వేసవి తాపం నుండి ట్రాఫిక్ సిబ్బంది రక్షణ పొందేందుకు వారికి జిల్లా ఎస్పీ సమ్మర్ వెల్ఫేర్ కిట్లను జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో అందచేసినారు. ఈ సమ్మర్ కిట్ లో ఎండ తీవ్రత నుండి కాపాడే హ్యాట్స్, సన్ గ్లాసెస్,ORSL ప్యాకెట్లు, మరియు వాటర్ బాటిల్ లు ఉన్నాయి. ఈ సందర్భముగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిత్యం ఎండలో నిలబడి దుమ్ము, ధూళి లెక్కచేయకుండా ట్రాఫిక్ సిబ్బంది ఎండ తీవ్రతలో కూడా తప్పనిసరిగా విధులు నిర్వహించాల్సి ఉంటుందని, వారికి స్వీయ రక్షణ చాలా అవసరమని, ఎండకు నీరు బాగా తాగాలని, డీహైడ్రేషన్ కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు.