విశాఖపట్నం: విశాఖ: గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం
విశాఖ రుషికొండ బీచ్లో ఆదివారం సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. గల్లంతైన ప్రాంతానికి దగ్గరలోని ఒడ్డుకు కొట్టుకువచ్చిన మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వీరు మామిడిశెట్టి శ్యామన్సాయి (14) మరియు మండల సంజయ్ (15)గా పోలీసులు ధృవీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ విషాదంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.