మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. సిఐ .రాజారెడ్డి,
అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు. మదనపల్లె డిఎస్పి మహేంద్ర ఆధ్వర్యంలో పట్టణంలో మంగళవారం పలు ప్రాంతాలలో వాహనాలు నడుపుతున్న 50 మంది మైనర్లను గుర్తించి వారి తల్లిదండ్రులకు పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రాజారెడ్డి మాట్లాడుతూ మైనర్లు డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని. హెల్మెంట్ తప్పకుండా ధరించాలని. ప్రతి ఒక్కరూ రహదారి నియమ నిబంధనలు పాటించాలన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీ రాజారెడ్డి హెచ్చరించారు.