ఒంగోలు అర్బన్: ఉద్యోగ విరమణ తీసిన పోలీసులను ప్రత్యేకంగా సత్కరించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | Jun 30, 2026
పోలీసు శాఖలో సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన ఐదుగురు ఎస్‌ఐలు, ఒక ఏఎస్‌ఐ, ఇద్దరు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్, ఒక డీపీఓ సిబ్బంది, ఒక హోం గార్డులను మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలతో సత్కరించి, వెండి జ్ఞాపికలను అందజేసి ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో చేరినప్పటి నుండి నేటి వరకు ప్రజలకు సేవ చేస్తూ ఉద్యోగ విరమణ పొందడం అదృష్టమన్నారు. పోలీసు ఉద్యోగంలో కుటుంబానికి దూరంగా ఉంటూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొనే పని చేశారని అభినందించారు