నంద్యాల అర్బన్: నంద్యాలలో మండల విద్యాధికారి కార్యాలయంలో మందు పార్టీ, వీడియో సోషల్ మీడియాలో వైరల్, ప్రజల ఆగ్రహం
Nandyal Urban, Nandyal | Jun 30, 2026
నంద్యాల పట్టణంలో నూనెపల్లె వద్ద నూతన మండల విద్యాధికారి కార్యాలయంలో మందు పార్టీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ పార్టీలో పాల్గొన్న వ్యక్తికి స్థానిక రాజకీయ నాయకుల అండదండలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన ఇప్పుడు రాజకీయంగా నంద్యాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ భవనాన్ని ఇంకా సంబంధిత శాఖకు అప్పగించలేదని తెలుపుతున్న అధికారులు.