సంతనూతలపాడు: నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా విక్రయాలు జరిపితే చర్యలు: ఉప్పుగుండూరులో ఎస్సై రజియా సుల్తానా
నాగులప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరులో బాణసంచా దుకాణదారులతో ఎస్సై రజియా సుల్తానా శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.... నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా విక్రయాలు జరిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతులు లేకుండా బాణసంచా నిల్వ ఉంచరాదన్నారు. దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసే బాణసంచా దుకాణాలు ఊరికి దూరంగా ఏర్పాటు చేసుకోవాలని, దుకాణాల వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.