రాప్తాడు: పోలేపల్లి గ్రామ సమీపంలో పంట పొలాలను హంద్రీనీ జలాలతో నిండిన సాగునీటి చెరువును పరిశీలించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్య సాయి జిల్లా రామగిరి మండలం పోలేపల్లి గ్రామంలో శనివారం నాలుగున్నర గంటల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పోలేపల్లి గ్రామ సమీపంలోని పంట పొలాలను హంద్రీనీవా నీటితో నిండిన చెరువును ఎమ్మెల్యే పరిటాల సునీత పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ హంద్రీనీవా కాలువ ద్వారా వచ్చిన నీటితో పోలేపల్లి చెరువును నింపడం జరిగిందని ఈ నీటిని వినియోగించుకొని రైతులు మంచి పంటలు వేసి అభివృద్ధిలోకి వస్తున్నారన్న భవిష్యత్తులో కూడా అన్ని చెరువులకు హంద్రీనీవా జలాలతో నింపుతామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నేతలు పాల్గొన్నారు.