పూరి-తిరుపతి ఎక్స్ప్రెస్ రైల్లో 15కిలోల గంజాయిని పట్టించిన పోలీసు శునకం రాక్సీ,ఇద్దరు అరెస్టు
Ongole Urban, Prakasam | Sep 15, 2025
ఒంగోలు రైల్వే స్టేషన్లో పూరి- తిరుపతి ఎక్స్ప్రెస్ రైల్లో ఈగల్ టీం సోమవారం సాయంత్రం తనిఖీలు జరపగా 15 కిలోల గంజాయి,75 వేల రూపాయల నగదు పట్టుబడింది. మత్తు పదార్థాలను గుర్తించడంలో నైపుణ్యం కలిగిన రాక్సీ అనే పోలీసు శునకం వాసన పట్టి ఈ గంజాయిని గుర్తించడం విశేషం.ఇలా గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని ఈగల్ టీం అదుపులోకి తీసుకొని విచారణ బాధ్యతలను ఒంగోలు రైల్వే పోలీసులకు అప్పగించింది.