పటాన్చెరు: గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలో బిజెపి పార్టీ సేవా పక్షం కార్యక్రమాలు : బీజేపీ మండల అధ్యక్షుడు కావలి ఐలేష్
గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలో మంగళవారం సేవా పక్షం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కావలి ఐలేష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పలువురు యువకులు ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి సేవా కార్యక్రమానికి తోడ్పడ్డారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు అభినందనలు తెలిపారు. ఈ సేవా పక్షం లో భాగంగా మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.