నాగలాపురం : మండల కేంద్రంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
నాగలాపురం మండలంలోని విద్యార్థులకు సోమవారం సైబర్ నేరాలు, డ్రగ్స్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ తిరుమల రావు, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ విద్యార్థులకు డ్రగ్స్ వాడకం వలన కలిగే అనర్థాలను వివరించారు. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 8వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులు వరకు హాజరయ్యారు.