బాల్కొండ: యూరియా విషయంలో రైతులెవ్వరు ఆందోళన చెందవద్దు: బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ కుమార్ రెడ్డి వెల్లడి
యూరియా విషయంలో రైతులెవరు ఆందోళన చెందవద్దని కావలసినంత యూరియా అందుబాటులోకి వస్తుందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ భరోసా ఇచ్చారు. మోర్తాడ్ ప్రజా నిలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూరియా విషయంలో ప్రభుత్వాన్ని కావాలనే బద్నాం చేస్తున్నారని అన్నారు. మంత్రిగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డికి జిల్లాలో ఎంత యూరియా అవసరమో ఇప్పటివరకు ఎంత సరఫరా అయిందో కూడా కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. స్వయంగా ప్రధాన మంత్రి యూరియా లోటు ఉంటుంది యూరియాని మోతాదులో వాడుకోవాలని సీజన్ ప్రారంభంలోనే చెప్పారని బిజెపి నాయకులు కూడా కేంద్ర ప్రభుత్వమే యూరియాని సరఫరా