బోయిన్‌పల్లి: మండల కేంద్రం శివారులో ద్విచక్ర వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండల కేంద్రం శివారులో,కాలినడకన వెళ్తున్న యువకుడిని ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ఘటన శనివారం రాత్రి 10 గంటలకు చోటుచేసుకుంది,వేములవాడకు చెందిన శేఖర్ ద్విచక్ర వాహనం పై బోయిన్పల్లి కి వచ్చి తిరిగి వేములవాడకు వెళ్తుండగా,బోయిన్పల్లి గ్రామ శివారులో కాలినడకన వెళ్తున్న గంగరాజును శేఖర్ ద్విచక్ర వాహనంతో ఢీ కొట్టాడు,దీంతో గంగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి స్థానికుల సహాయంతో గంగరాజు ని చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో సిరిసిల్లకు తరలించారు,ఇంకా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,