గుడిపల్లి గ్రామంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకలచెరువు మండలం గుడిపల్లి గ్రామంలో వెలిసిండు ఓం శ్రీ మాకాలమ్మ మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నూతన విగ్రహ ప్రతిష్ట పూజ కార్యక్రమంలో ఆదివారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ను పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన భాగ్యం కల్పించారు. ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఓం శ్రీ మాకాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.