పటాన్చెరు: కొడకంచి గ్రామ శివారులో బోల్తా కొట్టిన ఆటో
ఆటో బోల్తా కొట్టిన సంఘటన జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. జిన్నారం మున్సిపాలిటీ కొడకంచి గ్రామ శివారులోని దక్కన్ పరిశ్రమ సమీపాన ఆటో బోల్తా కొట్టింది. కొడకంచి గ్రామానికి చెందిన జగన్ ఆటో బోల్తా కొట్టడంతో ఆయనను స్థానిక ఆసుపత్రి తరలించారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి ఎస్ఐ హనుమంతు చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.