నంద్యాల అర్బన్: నంద్యాల పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం పూరిగుడిసెపైబడిన లారీ, వృద్ధురాలు మృతి
Nandyal Urban, Nandyal | Apr 29, 2026
నంద్యాలలోని చిన్న చెరువు కట్ట దిగువ ఉన్న గుడిసెపై ఐచర్ లారీ పడి వృద్ధురాలు మృతి చెందింది. రోడ్డుకు 20 అడుగుల దిగువలో కొందరు కూలీలు గుడిసెలను కట్టుకుని జీవనం సాగిస్తున్నారు. బుధవారం వేగంతో వచ్చిన ఐచర్ లారీ సుంకమ్మ గుడిసెపై పడింది. గుడిసె కుప్పకూలి అందులోని వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోలీసులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.