ఒంగోలు అర్బన్: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్ష
Ongole Urban, Prakasam | Jun 24, 2026
ప్రకాశం జిల్లాలోని పొగాకు రైతులకు గిట్టుబాటు ధరను కల్పించాలని కోరుతూ బుధవారం కలెక్టరేట్ ఎదుట పొగాకు రైతులు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను చేపట్టారు ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు మాట్లాడుతూ వర్జీనియా పొగాకు కిలో 250 రూపాయలకు కొనుగోలు చేయాలని రైతు పండించిన పంటను మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కంపెనీలతో టైప్ రైతులను మోసం చేసే చర్యలు చేపడితే చూస్తూ ఊరుకోమన్నారు యుద్ధం వల్ల ఎగుమతులు ఆగిపోయాయి జిఎస్టి రేట్లు పెరిగాయి అంటూ రైతులను మోసం చేస్తే తగిన పరిణామాలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతులు కిసాన్ మోర్చా నేతలు పాల్గొన్నారు