నేను రెండుసార్లు జనసేన వల్ల ఓడిపోయాను. జనసేన లోనే కొనసాగుతా: మాజీ మంత్రి బాలినేని
Ongole Urban, Prakasam | May 9, 2026
తాను రెండుసార్లు మాత్రమే ఎన్నికల్లో ఓడిపోయానని ఆ రెండుసార్లు కూడా జనసేన పార్టీ వల్లే ఓడిపోయారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలియచేసారు అయితే తాను పార్టీ మారతానని కొందరు పుకార్లు చేస్తున్నారని అందులో ఎటువంటి నిజం లేదన్నారు తాను పవన్ కళ్యాణ్ తోటే కొనసాగుతానని తేల్చి చెప్పారు అధికారం ఉన్నా లేకున్నా పవన్ కళ్యాణ్ కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి అన్నారు కార్యకర్తల కొరకు అతను ఆలోచిస్తున్న విధానం తనను ఎంతగానో నచ్చిందని తెలిపారు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కూడా కార్యకర్తల కొరకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు