కార్మికులను బానిసలుగా మార్చే కార్మిక కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు పిలుపునిచ్చారు. శనివారం గూడూరులో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలో వచ్చిన తర్వాత ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జులై 9న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.