ఒంగోలు అర్బన్: ఉమ్మడిజిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పై నిఘా ఉంచిన పోలీసులు, నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడి
Ongole Urban, Prakasam | Apr 15, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై నిరంతరం నిఘా ఉంటుందని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. బుధవారం అధికారులు తెలిపిన వివరాల మేరకు బస్సులో రక్షణ పరికరాలు లేకపోతే వారిపై చర్యలు తప్ప ఉన్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నడిపే డ్రైవర్ కి లైసెన్స్ కలిగి ఉండాలని అంతేకాకుండా బస్సు కండిషన్ లో ఉండాలని చెప్పారు. రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణించే 14 మృతి చెందిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.