ఒంగోలు అర్బన్: వేసవి నీటి ఎద్దరిని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి : జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ
Ongole Urban, Prakasam | May 2, 2026
జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆధ్వర్యంలో శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో డీఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లాలోని అధికారులు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా వేసవికాలం దృష్ట్యా మంచినీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు చేయవలసిన ప్రణాళికా రచనలపై చర్చించారు వేసవి ఉష్ణోగ్రతలో పెరుగుతున్నందున వేసవి ఉష్ణోగ్రతల నుంచి ప్రజలను రక్షించడానికి అవసరమైన వైద్య సౌకర్యాలను అన్ని సిహెచ్ షీలలో అన్ని ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులోకి తీసుకురావాలన్నారు ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన పరిశుభ్రమైన రక్షక మంచినీటిని అందించాలని కోరారు