బనగానపల్లె: రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
గిద్దలూరు-నంద్యాల రహదారి అభివృద్ధి పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. మార్కాపురం జిల్లా దిగువమెట్ట సమీపంలో జరుగుతున్న పనులను పరిశీలించిన మంత్రి.. పనుల నాణ్యతపై అధికారులకు పలు సూచనలు చేశారు. రహదారి అభివృద్ధి పనుల్లో కచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.