బనగానపల్లె: ఎండ తీవ్రతల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: సంజామల ఎంపీడీవో సాల్మన్
ఎండ తీవ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని సంజామల ఎంపీడీవో సాల్మన్ సూచించారు. అవసరం లేకుండా మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లకూడదన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. తగినంత నీరు, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకుంటూ శరీరాన్ని కాపాడుకోవాలన్నారు. ఎండ ప్రభావంతో అస్వస్థతకు గురైతే వెంటనే సమీప వైద్యశాలను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.