నారాయణపేట్: తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా బతుకమ్మ సంబరాలు చేయాలి: కలెక్టర్ సిక్తా పట్నాయక్
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ సంబరాలను జిల్లాలో వైభవ పేతంగా నిర్వహించాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వీసి హాలులో సోమవారం ఐదు గంటల సమయంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశమై బతుకమ్మ వేడుకల నిర్వహణ కోసం చేపట్టాల్సిన చర్యలపై దిశ నిర్దేశం చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ జిల్లాలో బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా జరిగెల కృషి చేయాలని సూచించారు.