గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు మాజీమంత్రి డొక్కా కు లేదు.. తాడికొండ వైసిపి ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు
Guntur, Guntur | Sep 15, 2025 ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతూ రాజకీయ విలువలు కోల్పోయిన మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని తాడికొండ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు అన్నారు. సోమవారం ఉదయం నగరంలోని బృందావన్ గార్డెన్స్ లోగల జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వనమా బాల వజ్రబాబు మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలుగుదేశం పార్టీ నేతలకు టచ్ లో ఉన్నారని తెలిపారు.