ఒంగోలు అర్బన్: యువతని అత్యాచారం చేసే ఆపై హత్య చేసిన నిందితులకు యావ జీవ జైలు శిక్ష విధించిన ఒంగోలు కోర్టు
Ongole Urban, Prakasam | Jun 23, 2026
ప్రకాశం జిల్లా చీరాలలో అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు యువకులకు ఒంగోలు కోర్టు యావ జీవ కారాగార శిక్ష విధించింది. నిందితులకు ఆశ్రయం కల్పించిన మరో వ్యక్తికి 5 సం.. జైలు శిక్ష విధించింది. 2024లో ఓ యువతిని విజయ్, మహేష్ బాబు అనే యువకులు అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. కోర్టు నిందితులకు రూ.20 వేలు జరిమానా తో పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పించింది. అత్యాచారాలకు పాల్పడే నిందితులకు కఠిన శిక్షలో తప్పవని ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు.