నందికోట్కూరు: ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసులు వసంహరించుకోవాలి: ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ మద్దయ్య యాదవ్
సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై రాష్ట్రంలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదైన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న బెదిరింపులను ఆపాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ జి మద్దయ్య యాదవ్, సీనియర్ జర్నలిస్ట్ పానుగంటి చంద్రయ్య డిమాండ్ చేశారు. గురువారం నందికొట్కూరు పట్టణంలోని పటేల్ సెంటర్ లో ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు పై అక్రమ కేసులు బనాయించడం, సోషల్ మీడియాలో దూషించడానికి వ్యతిరేకంగా జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు నిరసన వ్యక్త