కడప: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కడపలో రౌండ్ టేబుల్ సమావేశం
Kadapa, YSR | Sep 26, 2025 విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కడపలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీఐటీయూ అధ్యక్షులు కామనూరు శ్రీనివాసులు రెడ్డి, యూనియన్ నేతలు మాట్లాడుతూ గత 20–25 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, కొత్త ఆపరేటర్లకు సమాన వేతనం, 2022 పీఆర్సీ అరియర్స్, హెల్త్ కార్డులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్టోబర్ 5న విజయవాడలో అన్ని సంఘాలతో మరో సమావేశం, అక్టోబర్ 10న తిరుపతి ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముట్టడి నిర్వహించనున్నట్లు తెలిపారు.