సత్య సాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో కృష్ణ మందిరంలో టింబక్టు కలెక్టివ్ 35 వర్షం వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టింబక్టు సీనియర్ డైరెక్టర్లు మాట్లాడుతూ చెన్నైకొత్తపల్లి మండలంలో 35 సంవత్సరాలుగా టింబక్టు కలెక్టివ్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది, రైతులకు ప్రకృతి వ్యవసాయం పై ప్రత్యేకంగా శిక్షణ ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక శిక్షలు ఇవ్వడం జరిగిందని అదేవిధంగా మహిళలకు పొదుపు సంఘాలను ఏర్పాటు చేయడం వారి అభివృద్ధికి కూడా టింబక్టు కలెక్టివ్ ఎంతో సేవ చేస్తున్నామని టింబక్టు డైరెక్టర్లు పేర్కొన్నారు.