ఒంగోలు అర్బన్: సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి సర్ ప్రక్రియపై ఘాటైన హెచ్చరికలు చేసిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jul 9, 2026
ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు ఒంగోలు పట్టణంలోని గాంధీ నగర్ వద్ద ఉన్న వార్డు సచివాలయాన్ని గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. అందులో భాగంగా ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా బి ఎల్ వో లు చేస్తున్న ఓటర్ల నమోదు ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. ఈ.ఆర్.ఓ లుఎంతమంది ఉన్నారు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటరు నమోదు ప్రక్రియలో అలసత్వం వహిస్తున్న బి.ఎల్ ఓ అడిషనల్ బిఎల్ఓ పని తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని వేరే వారిని నియమించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.