ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు సిరాలదొడ్డి క్రాసింగ్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున కారు బోల్తా, ముగ్గురికి గాయాలు..
ఎమ్మిగనూరు సిరాలదొడ్డి క్రాసింగ్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున కారు బోల్తా పడింది. మహానంది నుంచి కర్ణాటకలోని సిరిగుప్పకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అకస్మాత్తుగా కుక్క అడ్డురావడంతో, దానిని తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.