నందికోట్కూరు: నందికొట్కూరు మిడుతూరులో ఈదురుగాలులతో కూడిన వర్షం
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణము మిడుతూరు మండలంలోని వీపనగండ్ల నాగ లూటీ పైపాలెం గ్రామాల్లో శనివారం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది నందికొట్కూరు పట్టణంలోని ఆది నగర్ లో ప్రధాన రహదారిపై చెట్టు విరిగిపడి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది, చాలా రోజుల తర్వాత వర్షం కురవడంతో ఇన్ని రోజులకు కరుణించావా వానదేవా అంటూ రైతులు సంతోషం వ్యక్తం చేశారు, పత్తి మొక్కజొన్న మిరప తదితర పంటలకు ఈ వర్షం చాలా ఉపయోగకరంగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు