బనగానపల్లె: అవుకు మండలంలో వైభవంగా సద్దలక్ష్మీ కంబగిరి స్వామి కళ్యాణ మహోత్సవం
నంద్యాల జిల్లా అవుకు మండలం జక్కులేరు వాగు వడ్డీన స్వయంభూగా వెలసిన శ్రీ సత్య లక్ష్మీ సమేత శ్రీ కంబగిరి స్వామి తిరు కళ్యాణోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవరోజు గురువారం తెల్లవారుజామున ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు