ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే మరియు నెల్లూరు పార్లమెంటు పరిశీలకులు జంకె వెంకటరెడ్డి స్వల్ప అస్వస్థత కారణంగా తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం ఆ భగవంతుడు కల్పించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.