ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రతి ఆరు నెలలకు వైద్య పరీక్షలు : నంద్యాల జిల్లా ప్రజా రవాణా అధికారిని రజియా సుల్తానా
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు నంద్యాల జిల్లా ప్రజా రవాణా అధికారిని రజియా సుల్తానా పేర్కొన్నారు, ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఆర్టీసీ కార్మికులకు ఆరోగ్యం పై అవగాహన సదస్సు నిర్వహించారు, ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రజా రవాణా అధికారిని రజియా సుల్తానా మాట్లాడుతూ.. ఉద్యోగులందరికీ పీరియాడికల్ హెల్త్ చెకప్ అమలు తప్పనిసరి చేసినట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఇటీవల ప్రకటించినట్లు ఆమె తెలిపారు.