వేటపాలెం బైపాస్ లో బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు,ఒకరి పరిస్థితి విషమం
బైకు అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడిన ఘటన వేటపాలెం బైపాస్ లో బుధవారం సాయంత్రం జరిగింది.వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.జబ్బార్ కాలనీకి చెందిన ఇద్దరు యువకులు కళాశాల మైదానంలో వ్యాయామం చేసి బైకుపై ఇంటికి తిరిగి వెళుతుండగా అధిక వేగం కారణంగా అది అదుపుతప్పి కరెంటు పోల్ ను ఢీ కొట్టింది.దీనితో వారు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు 108 సిబ్బంది వారిని అంబులెన్స్ లో చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసులు విచారణ చేపట్టారు.