ఆత్మకూరు: కంపసముద్రం సచివాలయంలో ఉద్రిక్తత, జోక్యం చేసుకున్న పోలీసులు
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, మర్రిపాడు మండలం, కంపసముద్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటసుబ్బయ్య అవినీతికి పాల్పడుతున్నారని జిల్లా అధికారులకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆత్మకూరు ఏపీడీ ప్రతాప్ రెడ్డి సోమవారం గ్రామంలో విచారణ చేపట్టారు. విచారణలో ఫీల్డ్ అసిస్టెంట్ కు సంబంధించిన వ్యక్తులు సచివాలయానికి చేరుకొని ఘర్షణ వాతావరణం సృష్టించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని సద్దుమణిచారు. ఈ సందర్భంగా ఏపీడీ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలియజేశారు.