జుక్కల్: మాగిలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం : సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు
గుర్తు తెలియని వ్యక్తులకు OTPలు చెప్పకూడదని, ఆకర్షణీయమైన ఆఫర్ల లింక్లపై క్లిక్ చేయకూడదని సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ (SST) సభ్యులు గురువారం సాయంత్రం మూడు గంటలకు సమయంలో సూచించారు. జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలం మాగిలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. బ్యాంకులలో అందించే సేవలు, సైబర్ నేరాలు, డిజిటల్ పేమెంట్స్, బీమా పథకాలు, సుకన్య సమృద్ధి యోజన తదితర పథకాలపై అవగాహన కల్పించారు.