పలమనేరు: బైరెడ్డిపల్లి: ఉధృతంగా ప్రవహిస్తున్న కైగల్ జలపాతం, మరో ప్రమాదం జరక్కుండా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది
బైరెడ్డిపల్లి: మండలం కైగల్ స్థానికులు తెలిపిన సమాచారం మేరకు. గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి భారీగా నీరు ప్రవహిస్తోంది దీంతో కైగల్ దుముకుడు రాళ్ల జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. శివలింగంపై నీరు పడుతున్న అద్భుతమైన దృశ్యాలు ఈ జలపాతానికి ఉన్న ప్రత్యేకత. పలమనేరు నియోజకవర్గ ప్రజలే కాకుండా తమిళనాడు కర్ణాటక ప్రాంత సమీప పర్యాటకులు అధిక సంఖ్యలో ఈ జలపాతాన్ని సందర్శిస్తుంటారు. కాగా సంబంధించిన అధికారులు తగు జాగ్రత్తలు తీసుకొని ప్రమాద నివారణ చర్యలు చేపట్టాల్సిఉందా లేదంటే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు.