పలమనేరు: కౌండిన్య నది నీటిని మళ్ళించి, మా పంటలను రక్షించండి అంటున్న జిల్లా రైతు నాయకుడు ఉమాపతి
పలమనేరు: చిత్తూరు జిల్లా రైతు నాయకుడు ఉమాపతి మాట్లాడుతూ, కౌండిన్యా నదిలో ప్రవహించే నీరు పక్కనున్న పంటపొలాలపై మూడింతలు ఎక్కువ ప్రవహిస్తున్న కారణంగా బారీ నీటి ప్రవాహానికి కొంతమంది వ్యవసాయ భూములు పూర్తిగా కోతకు గురై సారవంతమైన భూములు కూడా కొట్టుకుపోయి బండరాళ్లు తేలిపోయి బావులుగా గుంతలు పడి వ్యవసాయానికి పనికిరాకుండా పోతున్నాయన్నారు. పంటపొలాలపై నీళ్ళు వెళ్ళకుండా సిమెంటుతో నిర్మాణం చేపట్టాలని, ఏళ్ళ తరబడి పలుమార్లు సంబంధిత అధికారుల నుంచి జిల్లా కలెక్టరుకు ప్రజా ప్రతినిధులు అర్జీ రూపంలో తెలియపరిచాము కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.