ఒంగోలు అర్బన్: పర్యటకులతో కిటకిటలాడిన కొత్తపట్నం సముద్రతీరం, ఎప్పటికప్పుడు ప్రజలను హెచ్చరిస్తూ అప్రమత్తం చేసిన మెరైన్ పోలీసులు
Ongole Urban, Prakasam | May 24, 2026
ప్రకాశం జిల్లా కొత్తపట్నం బీచ్ ఆదివారం సందర్శకులతో కళకళలాడింది. సెలవుదినం కావడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా, సమీప ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కుటుంబాలు, యువత బీచ్కు తరలివచ్చారు. సముద్ర అలలను ఆస్వాదిస్తూ సందడి చేశారు. చిన్నారులు ఇసుకలో ఆటల్లో తేలియాడారు. బీచ్ పరిసరాల్లో తినుబండారాల దుకాణాలు రద్దీగా కనిపించాయి. పోలీసులు భద్రతా చర్యలు చేపట్టి పర్యాటకులకు జాగ్రత్తలు తెలిపారు.