మిడ్జిల్: మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధిలోని బోయినిపల్లి జడ్పీ ఉన్నంత పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు
విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్థమయ్యే రీతిలో బోధించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు మిడ్జిల్ మండలం బోయిని పల్లి జడ్.పి.ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.జిల్లా కలెక్టర్ మధ్యాహ్న బోజనం,పాఠశాల పరిసరాలు పరిశీలించారు.బియ్యం,ఆహార పదార్థాలు పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత గా అందించాలని,ఎటువంటి ఫీర్యా దులు రానివ్వద్దని సూచించారు.పాఠశాల పరిసరాలు పరిశుభ్రం గా ఉంచాలని ఆదేశించారు.