వీణవంక: మండల కేంద్రంలో CPM పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవం పాల్గొన్న CPM జిల్లా కమిటీ సభ్యులు సంపత్
వీణవంక: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సందర్భంగా బస్టాండ్ చౌరస్తాలో మంగళవారం సాయంత్రం అమరవీరుల స్థూపానికి నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా మండల సిపిఎం కార్యదర్శి పిల్లి రవి యాదవ్ అధ్యక్షతన వార్షికోత్సవ సభలో ముఖ్యఅతిథిగా హాజరైన cpm జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయూద పోరాట చరిత్రను కాంగ్రెస్ బీజేపీ వాడుకోవాలని కుట్రలు చేస్తున్నాయని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఐదు సంవత్సరాల పాటు పోరాటం చేసిందన్నారు రైతులకు లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసిందన్నారు ఈ పోరాటంలో 4వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు వీర మరణం పొందాలని గుర్తు చేశారు