ధర్మారం: పొలంలో రీల్ని కడుతుండగా కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి : ఎస్సై ప్రవీణ్ కుమార్
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన భూక్యా మల్లేష్ నాయక్ అనే రైతు పిట్టలు పంటను నష్టపరుస్తున్నాయని పొలానికి వెళ్లాడు. పిట్టలు రాకుండా ఉండటానికి రీల్ని కడుతుండగా ప్రమాదవశాత్తు 11 KV తీగలకు రీల్ వైరు తగిలి కరెంట్ షాక్ వచ్చి మృతి చెందాడు. ఆదివారం అతని భార్య సునీత ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.