సంగారెడ్డి: ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు, పాల్గొన్న అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య
సంగారెడ్డి పట్టణంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్ ఆధ్వర్యంలో పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన విరోచత పోరాటాల గురించి వివరిస్తూ ఆమె ఆశయా సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు మహిళలు పాల్గొన్నారు.