పుట్టపర్తి: ఆషాడ ఏకాదశి వేడుకల్లో పాల్గొనేందుకు దిండి యాత్రగా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి చేరుకున్న మహారాష్ట్రకు చెందిన భక్తులు
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి కి ధర్మవరం నుంచి మహారాష్ట్రకు చెందిన 3000 మంది భక్తులు దిండి యాత్రగా శనివారం మధ్యాహ్నం కాలినడకన పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. సాయి నామస్మరణ చేస్తూ భజనలు,కోలాటాల నడుమ సత్యసాయి, పండరినాథుని పల్లకీలను ఊరేగిస్తూ వస్తున్న భక్తులకు అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ధర్మవరం నుండి మూడు రోజులుగా 45 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తూ వచ్చిన భక్తులకు సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ అపూర్వ స్వాగతం పలికి ఆహ్వానించారు. భారీగా తరలి వచ్చిన భక్తులు పుట్టపర్తికి చేరుకోవడంతో ఆధ్యాత్మికత సంతరించుకుంది.