ఆళ్లగడ్డ: చాగలమర్రి పట్టణంలో అంగరంగ వైభవంగా గుర్రంపై పీర్ల ఊరేగింపు
నంద్యాల జిల్లా చాగలమర్రి పట్టణంలోని చిన్న మాకానం మసీదు వద్ద కొలువు దీరిన గుర్రపు పీర్ల ఊరేగింపును భక్తిశ్రద్ధలతో నిర్వహించారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు ముల్లా అన్సర్ భాష, పట్టణ అధ్యక్షుడు ఆలాంస మౌలాలి పాల్గొని పీర్లకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు, చాగలమర్రి పట్టణ వీధుల గుండా గుర్రపు పీర్లు ఊరేగింపు వైభవంగా సాగింది ఈ వేడుకలు తిలికించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు