బనగానపల్లె: విద్యుత్ అలంకరణలో కొలిమిగుండ్ల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యుత్ దీపాల అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కొండపై వెలసిన ఆలయానికి రామ్కో సిమెంట్స్ ఆధ్వర్యంలో అందమైన లైటింగ్ అలంకరణ చేపట్టారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న ఆలయాన్ని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.