బనగానపల్లె: బనగానపల్లెలో కరాటే నేర్చుకున్న చిన్నారులను అభినందించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లెలోని కేబి స్పోర్ట్స్ అండ్ మార్టల్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో మే ఒకటో తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు నిర్వహించిన 40 రోజుల వేసవి కరాటే శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది ఈ సందర్భంగా బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు వైట్ బెల్ట్ నుండి ఆరంజ్ బెల్ట్ వరకు ప్రమోషన్ బెల్టులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా కరాటే నేర్చుకున్న వారిని మంత్రి సతీమణి ప్రత్యేకంగా అభినందించారు